నిర్మాతగా మారనున్న మాసివ్ డైరెక్టర్

Saturday,September 22,2018 - 11:03 by Z_CLU

హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కాల్సి ఉన్న ‘దాగుడుమూతలు’ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ ఇద్దరు హీరోల సినిమా ప్రొడ్యూసర్ విషయంలోనే కొంచెం జాప్యం జరుగుతుంది అని తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమాని దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా నిర్మించనున్నాడనే టాక్, టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

 అయితే ఈ విషయాన్ని కంప్లీట్ గా ఖండించాడు హరీష్ శంకర్. ఫ్యూచర్ లో తను నిర్మాతగా మారడం గ్యారంటీ అని కన్ఫం చేసిన హరీష్ శంకర్, దాగుడు మూతలు సినిమాకు మాత్రం, తాను నిర్మాతను కాను అని క్లారిటీ ఇచ్చాడు. తన నిర్మాణంలో ఉండబోయే సినిమా డీటేల్స్ ని త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాను అని కన్ఫం చేశాడు హరీష్ శంకర్.

ఓ వైపు వీలైనంత త్వరలో ‘దాగుడుమూతలు’ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనే ప్రాసెస్ లో ఉన్న ఈ మాసివ్ డైరెక్టర్, మరో వైపు ప్రొడ్యూసర్ గా కూడా గ్రాండ్ డెబ్యూ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే హరీష్ శంకర్ చెప్పినట్టు, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.