DJ - ఆడియో రివ్యూ

Monday,June 12,2017 - 01:50 by Z_CLU

జూన్ 23 న రిలీజ్ కి రెడీ అవుతున్న DJ ఫ్యాన్స్ లో అన్ లిమిటెడ్ క్రేజ్ ని క్రియేట్ చేస్తుంది. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన డీజే సాంగ్స్ ప్రస్తుతం అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాయి…

DJ – ఫస్ట్ లుక్స్, టీజర్ తరవాత ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా రిలీజైన ఫస్ట్ సింగిల్ ఇది. ఈ సాంగ్  ఇలా సోషల్ మీడియాలో రిలీజ్ అయిందో లేదో జస్ట్ కొన్ని గంటల్లోనే  ట్రెండింగ్ అయింది. DJ టైటిల్ సాంగ్ అనగానే డెఫ్ఫినేట్ గా ఇంట్రడక్షన్ సాంగ్ అయి ఉంటుందని గెస్ చేసిన వారికి చిన్న సైజు షాకే ఇచ్చిందీ సాంగ్. ఈ సాంగ్ ట్యూన్స్, లిరిక్స్ ని గమనిస్తే, డెఫ్ఫినేట్ గా యాక్షన్ సీక్వెన్సెస్ పీక్ లో ఉన్నప్పుడు సిచ్యువేషనల్ గా ఉండే సాంగ్ అని అర్థమైపోతుంది. ఈ సాంగ్ ని విజయ్ ప్రకాష్ పాడాడు. జొన్నవిత్తుల లిరిక్స్ రాశారు.

అస్మైక యోగ : M.L.R. కార్తికేయన్, చిత్ర పాడిన పాట ఇది. సాహితీ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ గురించి నిజంగా డిస్కస్ చేయాలనే అనుకుంటే ఈ సాంగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించే మాట్లాడుకోవాలి. సంస్కృత పదాలను కూడా స్టైలిష్ గా ప్రెజెంట్ చేయగల సత్తా DSP దైతే, దాన్ని 100 % అడాప్ట్ చేసుకోగల డెడికేషన్ బన్నీది.

మెచ్చుకో పిల్లో : ఈ సాంగ్ మాత్రం డెడికేటెడ్ టు బన్ని ఫ్యాన్స్. నిన్న రిలీజ్ అయిన ఈ సాంగ్ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బిల్డ్ అయ్యే సిచ్యువేషన్ లో పడే సాంగ్ అని అర్థమైపోతుంది. DSP మార్క్ తో కంపోజ్ అయిన ఈ సాంగ్, థియేటర్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ. ఈ సాంగ్ ని నకాష్ అజీజ్ పాడాడు. శ్రీరామ్ లిరిక్స్ ఇచ్చాడు.

సీటీ మార్ : బన్ని ఏ సినిమా చేసినా ఆడియెన్స్ తో కమ్యూనికేట్ అయ్యేలా ఓ సాంగ్ కంపల్సరీ గా ప్లాన్ చేసుకుంటాడు. ఈ సినిమాలో సీటీమార్ సాంగ్ ఆ క్యాటగిరీ లోనిదే. బాలాజీ లిరిక్స్ రాసిన ఈ సాంగ్ కి థియేటర్ విజిల్స్ తో దద్దరిల్లడం గ్యారంటీ. జస్ ప్రీత్ జాజ్, రీటా ఈ పాట పాడారు.

బాక్స్ బద్దలైపోయే : DJ టీజర్స్ రిలీజై నప్పటి నుండే బన్ని, పూజా హెగ్డే కెమిస్ట్రీకి 100 కి 100 మార్కులు పడుతున్నాయి. ఆ రేంజ్ కెమిస్ట్రీకి స్కోప్ ఇచ్చిన సాంగ్ ఇది, అటు మాస్ బీట్స్ తో పాటు, పాడాలనే థాట్ లేకపోయినా, ఆటోమేటిక్ గా మైండ్ లో చక్కర్లు కొట్టే బీట్స్, నోట్లో ఈజీగా తిరగాడే లిరిక్స్… మొత్తానికి సినిమా రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో ఈ DJ ఆడియో బద్దలు కొట్టబోయే రికార్డులో ఈ ‘బాక్స్ బద్దలై పోయే’ షేర్ కంపల్సరీగా ఎక్కువ స్కోర్ చేసుకుంటుంది. సాగర్, గీతా మాధురి కలిసి పాడిన ఈ  సాంగ్ కి క్యాచీ లిరిక్స్ రాసింది భాస్కర భట్ల.

సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న DJ, ఆడియోతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో సింబాలిక్ గా చెప్పేసినట్టనిపిస్తుంది. సినిమా సక్సెస్ కి కావాల్సిన ప్రతి ఎలిమెంట్ ని ఏర్చికూర్చి ప్లాన్ చేసుకున్న DJ టీమ్, ఆ సిచ్యువేషన్స్ ఎలివేట్ అయ్యేలా సాంగ్స్ ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్ గా అర్థమైపోతుంది. ఆల్ రెడీ యూ ట్యూబ్ కౌంట్ పెంచుకుంటున్న ఈ ఆడియో జ్యూక్ బాక్స్ బన్ని కరియర్ లోనే కాదు, DSP కరియర్ లోను బెస్ట్ ప్లేస్ లో నిలిచిపోతుంది.