బన్ని DJ లేటెస్ట్ అప్ డేట్స్

Thursday,February 02,2017 - 07:03 by Z_CLU

స్పీడ్ చూస్తుంటే దువ్వాడ జగన్నాథం యమ దూకుడు మీద ఉన్నట్టు తెలుస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా అప్పుడే 50% షూటింగ్ కూడా చేసేసుకుంది.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్ సూపర్ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రతి షెడ్యూల్ కి ఆన్ టైం ప్యాకప్ చెప్తుంది. ఈ లోపు ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే, మరో వైపు సినిమా పబ్లిసిటీ ప్లానింగ్ కూడా మొదలుపెట్టేసింది సినిమా యూనిట్.

allu-arju-dj

DSP మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బ్రాహ్మణుడి గెటప్ లో కనిపించనున్న బన్ని ఫస్ట్ లుక్ ని కూడా రైట్ టైం చూసుకుని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది  DJ టీమ్.