ఇది దువ్వాడ సంచలనం

Tuesday,May 30,2017 - 02:30 by Z_CLU

బన్నీ నటిస్తున్న దువ్వాడ జగన్నాథమ్ – డీజే సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో రికార్డు బ్రేక్ చేసింది డీజే. నిన్ననే ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో రిలీజై 5 గంటలైనా గడవక ముందే ఆ సాంగ్ కు 10లక్షల వ్యూస్ వచ్చాయి.

ప్రస్తుతం వ్యూస్, జెట్ స్పీడ్ తో పెరుగుతున్నాయి. తాజా కౌంట్ ఏంటంటే.. విడుదలై 24 గంటలైనా కాకముందే డీజే సెకెండ్ సింగిల్ కు 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. బన్నీ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ఇదొక రికార్డు.

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా తెరకెక్కుతున్న డీజే సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా సింగిల్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలా సింగిల్స్ విడుదల చేసిన తర్వాత గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేసి, సినిమాను జూన్ 23న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.