DJ సీజన్ షురూ

Monday,June 19,2017 - 04:35 by Z_CLU

ఇంకా 4 రోజుల్లో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ DJ అప్పుడే టాలీవుడ్ స్ట్రీట్స్ లో హంగామా బిగిన్ చేసేసింది. సినిమా యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ తో, ఫ్యాన్స్ చేస్తున్న హడావిడితో ఎక్కడ చూసినా DJ ఫీవర్ డామినేట్ చేస్తుంది. రీసెంట్ గా సెన్సార్ క్లియరెన్స్ పొంది రెడీ టు రిలీజ్ మోడ్ లో ఉన్న DJ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బన్ని కరియర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్పేస్ ని ఆక్యుపై చేయడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బన్ని రెండు డిఫెరెంట్ లుక్స్ లో ఎంటర్ టైన్  చేయబోతున్నాడు. సినిమాలో ఎక్స్ పెక్ట్ చేయని సర్ ప్రైజెస్ ఉండబోతున్నాయని ఆడియో ఈవెంట్ రోజే సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన సినిమా యూనిట్, ప్రమోషన్స్ విషయంలోనూ ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్ రెడీ సూపర్ హిట్ ట్యాగ్ ని సొంతం చేసుకుంది. మరో వైపు అల్లు అర్జున్, పూజ హెగ్డే కెమిస్ట్రీ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్. సినిమాకి ఈ రేంజ్ లో వస్తున్న పాజిటివ్ బజ్ చూస్తుంటే, అల్లు అర్జున్ కరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ రికార్డ్ చేయడం ఖాయమనిపిస్తుంది.