సుధీర్ బాబు

Monday,July 10,2017 - 01:38 by Z_CLU

సుధీర్ బాబు ప్రముఖ కథానాయకుడు.సుధీర్ బాబు ప్రముఖ కథానాయకుడు దర్శకుడు, నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు మరియు ప్రముఖ కథానాయకుడు మహేష్ బాబు బావ. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. నాగ చైతన్య – సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ‘ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి)’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో నటుడిగా గుర్తింపు అందుకున్న సుధీర్ మారుతి దర్శకత్వం లో హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘ప్రేమ కథ చిత్రం’ తో సూపర్ హిట్ అందుకొని హీరోగా ఇమేజ్ పెంచుకున్నాడు. ఈ సినిమా తర్వాత ‘ఆడు మగాడ్రా బుజ్జి’,’దొంగాట’,’కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ ,మోసగాళ్లకు మోసగాడు’,’భలే మంచి రోజు’,’శ్రీ శ్రీ’,’శమంతకమణి’ సినిమాలలో నటించాడు. ‘భాగీ’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో విలన్ గా బాలీవుడ్ లో మంచి గుర్తింపు అందుకున్నాడు.

సంబంధిత వార్తలు