సందీప్ కిషన్

Monday,July 10,2017 - 03:05 by Z_CLU

సందీప్ కిషన్ ప్రముఖ కథానాయకుడు. సందీప్ కిషన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు అల్లుడు. మొదట ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సందీప్ కిషన్ శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘ప్రస్థానం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ‘స్నేహ గీతం’,’రొటీన్ లవ్ స్టోరీ’,’గుండెల్లో గోదారి’,’డి.కె.బోస్’,’మహేష్’ సినిమాల్లో నటించిన సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో సూపర్ హిట్ అందుకొని హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత ‘డి ఫర్ దోపిడీ’,’రారా క్రిష్నయ్య’,’జోరు’,’బీరువా’, ‘టైగర్’,’రన్’,’ఒక్క అమ్మాయి తప్ప’, ‘నక్షత్రం’,’శమంతకమణి’ వంటి పలు సినిమాల్లో నటించాడు.

సంబంధిత వార్తలు