సుధీర్ బాబు కొత్త సినిమాకి లైన్ క్లియర్

Friday,September 14,2018 - 07:16 by Z_CLU

సుధీర్ బాబు కొత్త సినిమా ‘నన్ను దోచుకుందువటే’ ఈ నెల 21 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ క్లియర్ చేసుకుని క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందింది. సుధీర్ బాబు నిర్మాతగా మారి నిర్మించిన మొట్ట మొదటి సినిమా ఇది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ యూత్ లో బాగానే రిజిస్టర్ అయింది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నతేష్ హీరోయిన్ గా నటించింది. టైటిల్ తోనే సినిమాపై అంచనాలను క్రియేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, సినిమా కూడా అదే స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అజనీష్ బి. లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి R.S. నాయుడు డైరెక్టర్. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.