ఫిబ్రవరి 17న ‘V’ టీజర్‌

Tuesday,February 11,2020 - 12:11 by Z_CLU

నేచురల్‌ స్టార్‌ నాని 25వ చిత్రం ‘V’. ఇందులో నాని రాక్షసుడి తరహా పాత్రలో కనిపించనున్నాడు. ఆయన దగ్గర నుండి అందరినీ కాపాడే రక్షకుడు లాంటి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో మరో హీరో సుధీర్‌బాబు నటిస్తున్నాడు. ఇటీవల వీరిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్‌ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది.

సుధీర్‌బాబు స్టైలిష్‌ లుక్‌తో కనపడుతుంటే.. నాని మెలితిప్పిన మీసాలతో రగ్డ్‌ లుక్‌లో కనపడుతున్నాడు. నానితో అష్మాచమ్మా, జెంటిల్‌మన్‌..సుధీర్‌ తో సమ్మోహనం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. అదితిరావు హైదరి, నివేదాథామస్‌ హీరోయిన్స్‌. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ చేయబోతున్నారు.

చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నారు. అలాగే సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు.