సుదీర్ బాబు కోసం మరోసారి

Wednesday,June 06,2018 - 05:08 by Z_CLU

సుదీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘సమ్మోహనం’ …ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 10న హైదరాబాద్ లో జరగనుంది.  ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ గెస్ట్ గా రానున్నాడనే వార్త నిన్నటి వరకూ చక్కర్లు కొట్టగా…లేటెస్ట్ గా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్. జూన్ 10 న జే.ఆర్.సి కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ కి మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా రానున్నాడని పోస్టర్ ద్వారా ప్రకటించారు.

సుదీర్ బాబు నటించిన ప్రతీ సినిమాను తన వంతుగా ప్రమోట్ చేస్తూ వస్తున్న మహేష్ ఇప్పుడు ‘సమ్మోహనం’ కోసం మరోసారి గెస్ట్ గా మారబోతున్నాడు. ఇప్పటికే సుదీర్ బాబు డెడికేషన్ గురించి…అలాగే తమ మధ్య ఉన్న క్లోజ్ నెస్ గురించి  ఎన్నో సందర్భాల్లో తెలియజేసిన మహేష్ ఈసారి  సుదీర్   గురించి కొత్తగా ఏం చెప్తాడో …చూడాలి.