అదితి రావు హైదరి నచ్చేసినట్టుంది

Thursday,March 14,2019 - 12:01 by Z_CLU

అదితి రావు హైదరి ఈ సారి నాని సరసన హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిందా..? ఎగ్జాక్ట్ గా చెప్పలేం ఎందుకంటే అదే సినిమాలో సుధీర్ బాబు కూడా హీరో నటిస్తున్నాడు. అందుకే అదితి రావు హైదరి నాని సరసన ఫిక్స్ అయ్యే చాన్సెస్ ఎన్ని ఉన్నాయో, సుధీర్ బాబు సరసన కనిపించే చాన్సెస్ కూడా అన్నే ఉన్నాయి. ఏది ఏమైనా మొత్తానికి మోహన కృష్ణ ఇంద్రగంటి మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాలైతే 100% కనిపిస్తున్నాయి.

రీసెంట్ గా మోహన కృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ లో ‘సమ్మోహనం’ లో నటించిందీ అదితి రావు హైదరి. ఆ సినిమా టైమ్ లో అమ్మడు డెడికేషన్ లెవెల్స్ కి ఇంప్రెస్ అయిపోయాడట ఈ దర్శకుడు. సినిమా సెట్స్ పైకి రాకముందే అందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టి స్క్రిప్ట్ మొత్తం మైండ్ లో ఫిక్స్ చేశాక కానీ ఇంద్రగంటి  యాక్షన్ చెప్పడు. ఆ ప్రాసెస్ లో తెలుగు రాకపోయినా ప్రతి అక్షరం నేర్చుకుని మరీ కో ఆపరేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ . అందుకే ఈ సారి కూడా అదితినే ఎంచుకున్నాడట  ఇంద్రగంటి.

‘సమ్మోహనం’లో  సుధీర్ బాబు, అదితి రావు హైదరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి కాబట్టి సుధీర్ సరసనే మళ్ళీ అదితి రావు ఫిక్సవుతుందా..? లేకపోతే ఈసారి డిఫెరెంట్ గా ఉంటుందని నాని సరసన ప్రిఫర్ చేస్తారా…? ఈ కన్ఫ్యూజన్ అంతా జస్ట్ ఒక్క  హీరోయిన్ పేరు మాత్రమే బయటికి రావడం వల్ల వచ్చింది. అదే ఇంకో హీరోయిన్ కూడా తెలిసిపోయి ఉంటే అంచనా వేయడానికి ఈజీగా ఉండేది.

ఏది ఏమైనా ఇప్పటి దాకా ఈ సినిమాకి టీమ్ అప్ అయిన ముగ్గురు కూడా మోహన కృష్ణ ఇంద్రగంటి తో పని చేసిన వాళ్ళే. కాబట్టి ప్రస్తుతానికి సస్పెన్స్ మోడ్ లో ఉన్న ఇంకో హీరోయిన్ కూడా రివీలై పోతే, ఎవరికి ఎవరో తేలిపోతుంది.