ఇక్కడ-అక్కడ.. తెలుగు హీరోల బాలీవుడ్ డ్రీమ్స్

Wednesday,April 24,2019 - 12:32 by Z_CLU

నిఖిల్ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ‘అర్జున్ సురవరం’ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఈ హీరో, సోషల్ మీడియాలో ఈ విషయాన్ని కన్ఫమ్ చేశాడు. ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా కరణ్ జోహార్ డైరెక్షన్ లో నటించబోతున్నానని ప్రకటించాడు. నిఖిల్ తో కలుపుకుంటే ఇలా బాలీవుడ్ కు వెళ్లిన కుర్ర హీరోల లిస్ట్ చాలానే ఉంది.

 

ప్రభాస్: బాహుబలితో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ప్రభాస్.. ఈసారి సాహోతో వాళ్లను పలకరించబోతున్నాడు. ప్రభాస్ చేస్తున్న స్ట్రయిట్ హిందీ మూవీ ఇది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కుతోంది.

రానా దగ్గుబాటి : ‘దమ్ మారో దమ్’ సినిమాతో బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ తరవాత చేసిన డిపార్ట్ మెంట్, బేబీ సినిమాలతో  మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ఈ సినిమాలతో పాటు వరసగా ‘యే జవానీ హై దివానీ’, ‘వెల్కం టు న్యూయార్క్’ సినిమాల్లో కామియో గా మెప్పించిన రానా ఇప్పుడు సెట్స్ పై ఉన్న ‘హౌజ్ ఫుల్ 4’ లో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

రామ్ చరణ్ : ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయ్యాడు రామ్ చరణ్. ఫస్ట్ సినిమాతోనే పవర్ ప్యాక్డ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.  మెగా పవర్ స్టార్ నుంచి మరో హిందీ మూవీ ఎప్పుడొస్తుందో చూడాలి.

సుధీర్ బాబు: ‘బాగి’ సినిమాలో విలన్ గా నటించాడు సుధీర్ బాబు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సీక్వెన్సెస్ లో సుధీర్ బాబు పర్ఫామెన్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమా తరవాత తెలుగులో మళ్లీ బిజీ అయిపోయాడు.

ఇలా టాలీవుడ్ కు చెందిన ఎంతోమంది యంగ్ హీరోస్ ఇప్పుడు అడపాదడపా బాలీవుడ్ లో కూడా మెరుస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి నిఖిల్ కూడా చేరాడు.