మనాలిలో నాని సినిమా

Saturday,October 12,2019 - 03:19 by Z_CLU

నాని, సుధీర్ బాబుల సినిమా ‘V’ రోజు రోజుకి క్యూరియాసిటీ రేజ్ చేస్తూనే ఉంది. సినిమాలో నాని రోల్ ఎలా ఉండబోతుందన్నది ఇప్పటికీ సస్పెన్సే. అందునా ఇది నానికి 25 వ సినిమా. ఫ్యాన్స్ ని డెఫ్ఫినెట్ గా సమ్ థింగ్ స్పెషల్ ఎలిమెంట్స్ తో ఎంటర్టైన్ చేస్తాడని ఫ్యాన్స్ స్ట్రాంగ్ నమ్మకం. అయితే ఈ సినిమాకి మనాలి ఎపిసోడ్స్ హైలెట్ కాబోతున్నాయని తెలుస్తుంది.

రీసెంట్ గా మనాలి విజిట్ చేసిన మేకర్స్ ఈ లొకేషన్ ని ఫిక్స్ చేసుకున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ లొకేషన్ లో తెరకెక్కించబోతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్ త్వరలో బిగిన్ కానుంది.

మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాతలు. అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజర్.