పక్కా బిజినెస్ మ్యాన్ అనిపించుకున్న సుధీర్ బాబు

Friday,June 29,2018 - 12:29 by Z_CLU

సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ ఫస్ట్ లుక్ రిలీజయింది. రీసెంట్ గా ఈ సినిమా మోషన్ టీజర్ రిలీజ్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ని బట్టి సుధీర్ బాబు ఈ సినిమాలో పక్కా బిజినెస్ మ్యాన్ లా కనిపించనున్నాడని తెలుస్తుంది.

పోస్టర్ లో సుధీర్ బాబు చేతిలో ఉన్న ఫోర్బ్స్ మ్యాగజైన్ తో పాటు ఫార్మల్ గెటప్ ని బట్టి, ఈ సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్ కూడా మోస్ట్ లావిష్ గా ఉండనుందని  అర్థమవుతుంది. సుధీర్ బాబు లేటెస్ట్ బాక్ బస్టర్ ‘సమ్మోహనం’ లో మిడిల్ క్లాస్ అబ్బాయిలా ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ హీరో, ఇప్పుడు సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరింత స్టైలిష్ గా మెస్మరైజ్ చేయనున్నాడు.

 

ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నతేష్ హీరోయిన్ గా నటిస్తుంది. R.S. నాయుడు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి B. లోకనాథ్ మ్యూజిక్ కంపోజర్.