ఆ హీరోతో చైతూ దర్శకుడు ఫిక్స్ ...?

Sunday,September 03,2017 - 12:40 by Z_CLU

ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న నాగ చైతన్య నెక్స్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో ముందున్నాడు ఇంద్రగంటి మోహన కృష్ణ.. ఇప్పటికే చైతూ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసి దాన్ని డెవలప్ చేసే పనిలో ఉన్న ఇంద్రగంటి చైతూ కంటే ముందు మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడట.. ఇప్పటికే హీరో సుధీర్ బాబుకి ఓ స్క్రిప్ట్ వినిపించాడని, త్వరలోనే ఈ యంగ్ హీరోతో ఈ డైరెక్టర్ సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడనే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది..

ఇటీవలే ‘అమీ తుమీ’ వంటి చిన్న సినిమాతో పెద్ద హిట్ అందుకున్న ఇంద్రగంటి సుధీర్ బాబుతో ఓ డిఫరెంట్  సినిమా చేయబోతున్నాడని, ఈ సినిమాలో సుధీర్ చాలా డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేస్తాడనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం వార్తగానే ఉన్న ఈ సినిమాను ఇంద్రగంటి త్వరలోనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.