Sudheer Babu - సోడా సెంటర్ పెట్టాడు

Sunday,November 01,2020 - 06:10 by Z_CLU

హీరో సుధీర్ బాబు సోడా సెంటర్ పెట్టాడు. దానికి Sridevi Soda Center అనే పేరు కూడా పెట్టాడు. పక్కా మాస్ రోల్ లో Sudheer Babu చేయబోయే సినిమా ఇది. సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

పలాసతో క్రిటిక్స్ మెప్పుపొందిన కరుణ కుమార్, ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ నెలలోనే రెగ్యులర్ షూట్ ఉంటుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

గతంలో సుధీర్ బాబుతో భలే మంచి రోజు సినిమా తీసిన 70 MM Entertainments నిర్మాతలే ఈ ప్రాజెక్టును కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆనందోబ్రహ్మ, యాత్ర లాంటి హిట్స్ ఈ బ్యానర్ పైనే వచ్చాయి.

హీరో – సుధీర్ బాబు
బ్యాన‌ర్ – 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత‌లు – విజ‌య్ చిల్లా, శిశిదేవిరెడ్డి
మ్యూజిక్ – మ‌ణిశ‌ర్మ‌
డిఓపి – షామ్ ద‌త్ శైనుద్దీన్
ఎడిట‌ర్ – శ్రీక‌ర్ ప్ర‌సాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన్ – రామ‌కృష్ణ – మోనిక‌
ద‌ర్శ‌కుడు – కరుణ కుమార్