అవును.. అది నా వాయిస్ కాదు

Tuesday,October 16,2018 - 05:22 by Z_CLU

వీరభోగవసంతరాయలు… నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు నటించిన మల్టీస్టారర్ సినిమా. శ్రియ ఓ కీలక పాత్ర పోషించింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ ను నిన్న రిలీజ్ చేశారు. ట్రయిలర్ చాలా బాగుంది. కానీ అందులో సుధీర్ బాబు వాయిస్ మాత్రం కాస్త తేడాకొట్టింది.

అవును.. వీరభోగవసంతరాయలు ట్రయిలర్ లో సుధీర్ బాబు వాయిస్ ఒరిజినల్ కాదు, వేరే వ్యక్తితో ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పించారు. దీనిపై ఈరోజంతా సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. దీంతో సుధీర్ బాబు ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యాడు.

అది తన గొంతు కాదని క్లారిటీ ఇచ్చాడు సుధీర్ బాబు. కొన్నికారణాల వల్ల వీరభోగవసంతరాయలు సినిమాకు డబ్బింగ్ చెప్పలేదని స్పష్టంచేశాడు. నిన్న జరిగిన ఈ సినిమా ట్రయిలర్ లాంఛ్ కు కూడా సుధీర్ బాబు హాజరుకాలేదు.