"నన్ను దోచుకుందువ‌టే" గ్రాండ్ రిలీజ్ కు రెడీ

Wednesday,September 05,2018 - 01:01 by Z_CLU

సుధీర్ బాబు తొలిసారి నిర్మాతగా మారి హీరోగా నటించిన చిత్రం నన్ను దోచుకుందువటే. ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 21న గ్రాండ్ గా సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

నిజానికి ఈ సినిమాను 13నే విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే తేదీకి శైలజారెడ్డి అల్లుడు సినిమాతో పాటు యూ-టర్న్ కూడా విడుదలకు సిద్ధమవ్వడంతో తన సినిమాను 21కి వాయిదా వేశాడు సుధీర్ బాబు. అదే విషయాన్ని ఈరోజు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు.

నన్ను దోచుకుందువటే ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం… హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించడంతో అందరికీ కనెక్ట్ అయింది. ఆఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్ గా సుధీర్‌బాబు న‌టించ‌గా.. అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు

నటీనటులు
సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు

సాంకేతిక వర్గం
డిఓపి – సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్ – అజనీష్ బి లోకనాథ్
ఆర్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
పిఆర్ఓ – ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్. సాయి వరుణ్
నిర్మాత – సుధీర్ బాబు
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ – ఆర్ ఎస్. నాయుడు