సమ్మోహనం

Thursday,February 22,2018 - 07:21 by Z_CLU

నటీ నటులు : సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నందు, రాహుల్ రామ‌కృష్ణ‌, హ‌రితేజ‌ తదితరులు
ఛాయాగ్రహణం: పి.జి.విందా
సంగీతం: వివేక్ సాగ‌ర్
నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌
ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి

 

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన `జెంటిల్‌మేన్‌` ఎంత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రోసారి క‌లిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ తాజా చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం ఉద‌యం మొద‌లైంది. ఫ‌స్ట్ షాట్‌కు ప్రముఖ నటులు -రచయిత  త‌నికెళ్ల భ‌ర‌ణి క్లాప్‌కొట్టారు. నట దర్శకులు అవ‌స‌రాల శ్రీనివాస్ ఫ‌స్ట్ షాట్‌కు గౌరవ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ణిర‌త్నం `చెలియా` సినిమాలో నాయిక‌గా న‌టించి అందరినీ ఆక‌ట్టుకున్న బాలీవుడ్ భామ అదితిరావు హైదరీ ఈ సినిమాలో నాయిక‌గా న‌టిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది.
సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నందు, రాహుల్ రామ‌కృష్ణ‌, హ‌రితేజ‌, ప‌విత్ర లోకేష్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌శ‌ర్మ, అభ‌య్‌, హ‌ర్షిణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మేక‌ప్‌: పి.బాబు, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఎన్‌. మ‌నోజ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: ఆర్‌.సెంథిల్‌, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

Release Date : 20180615