మెగాస్టార్ మాటల్లో సమ్మోహనం...

Wednesday,May 02,2018 - 06:32 by Z_CLU

మోస్ట్ ఇంటెన్సివ్ లవ్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతుంది సుధీర్ బాబు సమ్మోహనం. మెగాస్టార్ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజవ్వడంతో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవ్వడమే కాదు, యూ ట్యూబ్ లో ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అయింది ఈ టీజర్. అయితే ఈ టీజర్ గురించి మెగాస్టార్ తన ఒపీనియన్ ని షేర్ చేసుకున్నాడు.

“టీజర్ చూసినప్పుడు చాలా తమాషాగా అనిపించింది. ఎవరైనా సరే తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు  రొమాంటిక్ గా మాట్లాడతారు, ఏదైనా పొగుడుతూ మాట్లాడతారు. కానీ ఈ టీజర్ లో కంప్లీట్  డిఫెరెంట్ గా పళ్ళూడిపోయి, జుట్టు రాలిపోయి, కాళ్ళు వంకరపోయి అని మాట్లాడటం చాలా కొత్తగా, జెన్యూన్ గా అనిపించింది. ముఖ్యంగా హీరోయిన్ చాలా ఫ్రెష్ లుక్ అనిపించింది.” అని టీజర్ గురించి చెప్పుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శివలెంక ప్రసాద్ నిర్మిస్తున్నాడు. జూన్ 15 న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సుధీర్ బాబు సరసన అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించింది.