సేమ్ జోనర్ ని రిపీట్ చేస్తున్న సుధీర్ బాబు

Monday,June 18,2018 - 07:56 by Z_CLU

సమ్మోహనం సినిమాతో కంప్లీట్ గా టాలీవుడ్ లో రొమాంటిక్ సీజన్ క్రియేట్ అయింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మ్యాగ్జిమం అన్ని క్యాటగిరీస్ ని ఎంటర్ టైన్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాతో రొమాంటిక్ హీరో మార్క్ ని క్రియేట్ చేసుకున్న సుధీర్ బాబు సొంత నిర్మాణంలోను కలిసొచ్చిన జోనర్ నే ప్రిఫర్ చేశాడు.

రీసెంట్ గా సొంత ప్రొడక్షన్ బ్యానర్ ని లాంచ్ చేసిన సుధీర్ బాబు, నిన్న తన బ్యానర్ లో ఫస్ట్ మూవీ ‘నన్ను దోచుకుందువటే’ మోషన్ టీజర్ ని రిలీజ్ చేశాడు. ఈ టైటిల్, పోస్టర్ ని బట్టి ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ లవ్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది.

ప్రస్తుతం ‘సమ్మోహనం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాడు. సుదీర్ బాబు సరసన నభా నతేష్ హీరోయిన్ గానటిస్తుంది. R.S. నాయుడు ఈ సినిమాకి డైరెక్టర్. అజనీష్ B. లోకనాథ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.