సుధీర్ బాబు ‘సమ్మోహనం’ ట్రైలర్ రివ్యూ

Thursday,May 31,2018 - 03:29 by Z_CLU

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ రోజు లాంచ్ అయింది సుధీర్ బాబు ‘సమ్మోహనం’ ట్రైలర్. రీసెంట్ గా రిలీజైన టీజర్ కి కొనసాగింపుగా ఉన్న ఈ ట్రైలర్ లో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటేల్స్ రివీల్ చేశారు ఫిల్మ్ మేకర్స్.

“అయినా అసలేముందిరా ఈ స్టార్స్ లో”… అంటూ బిగిన్ అయ్యే ఈ ట్రైలర్ ని బట్టి స్టోరీ మొత్తం ఇలిస్ట్రేటర్ ఆర్టిస్ట్ అయిన హీరో చుట్టూ తిరుగుతుందని అర్థమవుతుది. సినిమా వాళ్ళంటేనే మంచి అభిప్రాయం లేని ఈ కుర్రాడు, ఏకంగా స్టార్ తో లవ్ లో పడితే ఏం జరుగుతుంది..? ఈ సినిమాలో దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి స్టార్ లైఫ్ లో ఉండే స్ట్రగుల్స్, సెన్సిటివిటీస్ ని స్క్రీన్ పై ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది.

జూన్ 15 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ సాగర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.