సమ్మర్ రేస్ లో హీరో సుధీర్ బాబు

Tuesday,April 24,2018 - 04:26 by Z_CLU

మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సుధీర్ బాబు సినిమా ‘సమ్మోహనం’. ఈ సినిమాలో సుధీర్ బాబు చిన్న పిల్లల బుక్స్ డిజైన్ చేసే ఇలస్ట్రేటర్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా ఈ రోజు సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక కంప్లీట్ ఫోకస్ పోస్ట్ ప్రొడక్షన్ పై పెట్టనున్న ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమాని జూన్ 15 న గ్రాండ్ గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.  

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని క్యాటగిరీస్ ని ఇంప్రెస్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న ఫిల్మ్ మేకర్స్, ఆ డీటేల్స్ ని త్వరలో అనౌన్స్ చేస్తారు.

 

సుధీర్ బాబు సరసన అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది . శివలెంక కృష్ణ  ప్రసాద్ ప్రొడ్యూసర్.  వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.