సుధీర్ బాబు సినిమాకు ఫెస్టివ్ రిలీజ్ డేట్

Monday,July 16,2018 - 03:50 by Z_CLU

సొంతంగా బ్యానర్ పెట్టి నిర్మాత కమ్ హీరోగా తొలి సినిమా సిద్ధం చేశాడు సుధీర్ బాబు. దానిపేరు నన్ను దోచుకుందువటే. టైటిల్ తో పాటు టీజర్ తో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. దీనికి తోడు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్న స్టిల్స్ కూడా ఈ సినిమాపై క్యూరియాసిటీ కలిగిస్తోంది. ఇలా రోజురోజుకు అంచనాలు పెంచుకుంటున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు సుధీర్ బాబు.

ప్రొడ్యూసర్ గా తన డెబ్యూ మూవీకి ఫెస్టివ్ డేట్ లాక్ చేశాడు సుధీర్ బాబు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న “నన్ను దోచుకుందువటే” సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు. యూఎస్ లో 12వ తేదీ నుంచి ఈ మూవీ ప్రీమియర్స్ షురూ అవుతాయి.

కొత్త దర్శకుడు ఆర్ఎస్ నాయుడు తీసిన ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నాబా నతేష్ హీరోయిన్ గా నటించింది. హీరోగా సుధీర్ బాబు ఎలాంటి విలక్షణమైన కథలు, పాత్రలు ఎంచుకుంటాడనే విషయం మనకు తెలిసిందే. అలాంటిది తనే సొంతంగా డబ్బులు పెట్టి ఓ సినిమా చేస్తున్నాడంటే, “నన్ను దోచుకుందువటే” మూవీ ఎంత స్పెషల్ గా ఉండబోతోందో అర్థంచేసుకోవచ్చు. కిరాక్ పార్టీ ఫేం అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు