ఫస్ట్ టైమ్ తెరపైకి కలిసి...

Friday,November 15,2019 - 02:35 by Z_CLU

ఇంట్రెస్టింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే ఫ్యాన్స్ లో న్యాచురల్ గానే అంచనాలుంటాయి. అలాంటిది ఇప్పటి వరకు జస్ట్ ఇమాజినేషన్ కే పరిమితమైన కాంబినేషన్స్ సెట్స్ పైకి వస్తే…? ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి నెవర్ సీన్ బిఫోర్ కాంబినేషన్స్… సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా… ఎప్పుడెప్పుడు తమ ఫేవరేట్ స్టార్స్ ని ఒకేసారి స్క్రీన్ పై చూసుకునే అవకాశం దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్…

NTR – రామ్ చరణ్ : ఈ కాంబినేషన్ ని నెవర్ సీన్ బిఫోర్ అనడం కంటే.. ఆల్మోస్ట్ ఇది జరగదు అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయిన కాంబినేషన్. ఇప్పటికైనా ఇది పాసిబుల్ అయిందంటే అది డెఫ్ఫినెట్ గా రాజమౌళి వల్లే…

వెంకటేష్ నాగచైతన్య : ఈ మామా అల్లుళ్ళ స్వాగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వైబ్స్ జెనెరేట్ చేస్తుంది. లాంగ్ బ్యాక్ నుండి డిమాండ్ లో ఉన్న కాంబో ఇది. ఇన్నాళ్ళకు పాసిబుల్ అయింది.

నాని -సుధీర్ బాబు : ఓ రకంగా చెప్పాలంటే ఈ కాంబో నాని వల్లే పాసిబుల్ అయింది. సోలో హీరో కాస్త మల్టీస్టారర్స్ గా కూడా చేస్తాడు అనిపించుకున్నాడు. ఆ తరవాత ఇప్పుడు ఇప్పుడు విలన్ గా కనిపించబోతున్నాడు. నాని, సుధీర్ బాబు ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తున్నారు.