నాని కొత్త సినిమా – పాత ప్రశ్న

Tuesday,April 30,2019 - 12:03 by Z_CLU

నిన్న నాని, సుధీర్ బాబుల మల్టీస్టారర్ ‘V’ ఫస్ట్ లుక్  లోగో రిలీజైంది. ఏమీ చెప్పకుండానే జస్ట్ పోస్టర్ తోనే ఆడియెన్స్ లో క్వశ్చన్ రేజ్ చేశారు మేకర్స్. ‘ఇంతకీ ఈ సినిమాలో నాని హీరోనా..? విలనా..?’… నాని సినిమాల్లో ఇలాంటి క్వశ్చన్ రేజ్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ‘జెంటిల్ మేన్’ సినిమా టైమ్ లోను ఇలాంటి ప్రశ్నే తలెత్తింది. 

టైటిల్ ‘V’ తో స్టార్ట్ అవ్వడం… సినిమాలోని స్టార్స్ అందరి పేరు ఒకచోట మెన్షన్ చేసి, నాని పేరును మాత్రం పోస్టర్ మధ్యలో అందునా ‘V’ అక్షరానికి మధ్యలో ఉంచడం లాంటి స్పెషల్ జిమ్మిక్కులతో న్యాచురల్ గానే కాన్సంట్రేషన్ సినిమాలోని నాని రోల్ పై పడేలా చేశారు మేకర్స్.  

 

గతంలో ‘జెంటిల్ మెన్ సినిమా విషయంలో కూడా ఇదే టైప్ లో ప్రమోషన్స్ చేశారు మేకర్స్. సినిమా చూస్తున్నంత సేపు నాని రోల్ విషయంలో సస్పెన్స్ ఉంటుంది. క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత మాత్రమే అసలు విషయం తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో కూడా సేమ్ స్ట్రాటజీ పాటిస్తున్నారు మేకర్స్.

V’ లో కూడా ‘జెంటిల్ మేన్’ లాంటి సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయా..? కచ్చితంగా ఉంటాయంటోంది యూనిట్. ఇప్పటివరకు పోషించిన సరికొత్త పాత్రను  నాని పోషిస్తున్నాడట. సినిమాలో నాని అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడనే రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ, మూవీ రిలీజ్ అయ్యేంతవరకు ఈ సస్పెన్స్ ను కంటిన్యూ చేయబోతున్నారు.