నాని ‘V’ సినిమా షూటింగ్ పూర్తి

Thursday,January 02,2020 - 02:06 by Z_CLU

నాని ‘V’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసింది. ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షనే. ఉగాది కానుకగా మార్చి 25 న రిలీజవుతుందీ సినిమా.

నాని కరియర్ లో ఇది 25 వ సినిమా. అందునా ఈ సినిమాలో కరియర్ లోనే ఫస్ట్ టైమ్  నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో నాని నటించిన ప్రతి సినిమా హిట్టే.. అందుకే ఈ సినిమాపై కూడా ఆడియెన్స్ లో భారీ అంచనాలున్నాయి.

అమిత్ త్రివేది ఈ సినిమాకి మ్యాజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సుధీర్ బాబుగా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరి, నివేత థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.