Sudheer Babu - కొత్త సినిమా ప్రకటించిన సుధీర్ బాబు

Friday,October 28,2022 - 01:28 by Z_CLU

Sudheer Babu new movie with Director Gnanasagar

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు సుధీర్ బాబు. 2 సినిమాలు సెట్స్ పై ఉంటుండగానే, మరో సినిమా ప్రకటిస్తూ జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడీ హీరో ఇంకో సినిమా ప్రకటించాడు. (Sudheer Babu New Movie)

సుధీర్ బాబు 18వ చిత్రం ప్రకటన వచ్చేసింది. సెహరి సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు సుధీర్ బాబు. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సౌత్ బొంబాయికి చెందిన అరుణ్ గౌలి నుండి చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రమణ్యం వచ్చిన ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డ్ కనిపిస్తుంది. ”క్రిటికల్: నీ రాక అవసరం.” అనే మెసేజ్ కూడా కార్డ్ పై ఉంది.

తుపాకీ, బుల్లెట్‌లు, పాత 5 వందల రూపాయి నోటు, ల్యాండ్‌లైన్ ఫోన్ , సిగార్ తో పాటు పోస్టర్‌లో దేవాలయం, గ్రామ వాతావరణం కనిపిస్తుంది. అక్టోబరు 31న మాస్ సంభవం” అని ఆ రోజు వచ్చే అప్‌డేట్‌ ని గురించి పోస్టర్ లో సూచించారు మేకర్స్.

డివోషనల్ ఎలిమెంట్స్ తో కూడిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. ఈ కథ 1989 కుప్పంలో జరుగుతుంది. పూర్తి నేటివిటీ కథతో, సుధీర్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ లుక్ లో చూపిస్తూ ఈ సినిమా రాబోతోంది.

Sudheer Babu new movie Ghanasagar