అదీ సుధీర్ బాబు - నన్ను దోచుకుందువటే టీజర్

Saturday,July 14,2018 - 12:05 by Z_CLU

సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ టీజర్ రిలీజయింది. రీసెంట్ గా సమ్మోహనం సినిమాతో మెస్మరైజ్ చేసిన ఈ హీరో  ఇప్పుడు మరో లవ్ ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్నాడు. కేవలం 1:11 సెకన్ల టీజర్ లో కంప్లీట్ సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశాడు ఈ డెబ్యూ ప్రొడ్యూసర్.

ఎగ్జాక్ట్ గా సుధీర్ బాబు ఈ సినిమాలో హ్యాండిల్ చేసే బిజినెస్ ఏంటో తెలీదు కానీ, కనీసం మొహం పై చిన్న నవ్వు కూడా కనిపించని స్ట్రిక్ట్ మ్యానేజర్. కొలీగ్స్ విషయంలో తేడా వస్తే నిర్దాక్షిణ్యంగా  సెక్యూరిటీ తో బయటికి గెంటించేస్తాడు. ఇక  హీరోయిన్ విషయానికి వస్తే దానికి కంప్లీట్ గా ఆపోజిట్  క్యారెక్టర్. సిరి సాఫ్ట్ వేర్ ఇంజినీర్… వీరి ఇద్దరి మధ్య క్రియేట్ లవ్వే సినిమాలో మెయిన్ కంటెంట్.

టీజర్ లో నాజర్ క్యారెక్టర్ ని బట్టి ఫిల్మ్ మేకర్స్  జస్ట్ లవ్ ఎలిమెంట్స్ తో సరిపెట్టుకోకుండా ఫ్యామిలీ ఇమోషన్స్  కి కూడా  మంచి స్కోప్ క్రియేట్ చేసుకున్నట్టే తెల్సుతుంది. ఇకపోతే మన హీరో అన్ లిమిటెడ్ కోపానికి వెనక ఉన్న బ్యాక్ డ్రాప్ స్టోరీ తో పాటు  హీరో లైఫ్ లోకి హీరోయిన్ ఎంట్రీ, ఆ తరవాత వీరిద్దరి  అన్ మ్యాచ్డ్ ఫన్ & ఇమోషనల్ జర్నీ,  సినిమాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్.

ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నతేష్  హీరోయిన్ గా నటిస్తుంది.R .S . నాయుడు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అజనీష్ B . లోకనాథ్ మ్యూజిక్  కంపోజ్ చేస్తున్నాడు.ఈ సినిమాని సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధీర్ బాబు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.