Brahmastra బాలీవుడ్ ఆఫర్ వచ్చింది కానీ వద్దనుకున్నా

Thursday,September 15,2022 - 04:54 by Z_CLU

రన్బీర్ కపూర్ , అలియా భట్ జంటగా ఆయాన్ డైరెక్షన్ లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ మంచి వసూళ్ళు అందుకుంటూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. నాగార్జున ఇందులో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో సుదీర్ బాబు కి కూడా ఆఫర్ వచ్చిందట. కానీ ఈ బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాను సుదీర్ వద్దనుకున్నాడట.

ఇటివలే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో సుదీర్ తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. సుదీర్ బాబు బాగీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. వర్షం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు సుదీర్. ఆ సినిమాతో అక్కడ మంచి గుర్తింపు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ హిందీలో సినిమా చేయలేదు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎందుకు హిందీలో చేయలేదు ? ఆఫర్స్ రాలేదా ? అనే ప్రశ్నకు సుదీర్ సమాధానమిచ్చాడు.

“‘బాగి’ తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ చేయలేదు. అందులో బ్రహ్మాస్త కూడా ఉంది. అందులో ఓ రోల్ కోసం అప్రోచ్ అయ్యారు. కానీ ఆ సమయంలో నేను సమ్మోహనం సినిమా చేస్తున్నాను. అలాగే పుల్లల గోపీచంద్ బియోపిక్ లైనప్ లో ఉంది. అందుకే బ్రహ్మాస్త్ర ఆఫర్ వదులుకున్నాను అంటూ చెప్పుకున్నాడు సుదీర్. అయితే అందులో ఏ రోల్ కోసం తనని అడిగారనేది మాత్రం ఓపెన్ అవ్వలేదు కుర్ర హీరో.