సుధీర్‌బాబు చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ షురూ!

Monday,December 11,2017 - 03:30 by Z_CLU

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన `జెంటిల్‌మేన్‌` ఎంత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రోసారి క‌లిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ తాజా చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ఈరోజు మొద‌లైంది.

ఫ‌స్ట్ షాట్‌కు ప్రముఖ నటుడు -రచయిత త‌నికెళ్ల భ‌ర‌ణి క్లాప్‌కొట్టారు. అవ‌స‌రాల శ్రీనివాస్ ఫ‌స్ట్ షాట్‌కు గౌరవ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ణిర‌త్నం `చెలియా` సినిమాలో నాయిక‌గా న‌టించి అందరినీ ఆక‌ట్టుకున్న బాలీవుడ్ భామ అదితిరావు హైదరీ ఈ సినిమాలో హీరోయిన్.

శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈరోజు ప్రారంభమైన ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ 23 వరకు కొనసాగుతుంది. జ‌న‌వ‌రి 2 నుంచి జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు, జ‌న‌వ‌రి 20 నుంచి ఫిబ్ర‌వ‌రి 8 వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే షూటింగ్ చేస్తారు.. ఆ త‌ర్వాత జ‌రిగే షెడ్యూళ్ల‌ను హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ముంబైలో ప్లాన్ చేశారు. మార్చితో షూటింగ్ పూర్తిచేసి, మే నెలలో సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.