రక్షకుడు వచ్చేశాడు.. V ఫస్ట్ లుక్ రిలీజ్

Monday,January 27,2020 - 11:41 by Z_CLU

నాని-సుధీర్ బాబు హీరోలుగా వస్తున్న యాక్షన్ ప్యాక్డ్ రివెంజ్ డ్రామా V. ఈ సినిమాకు సంబందించి రక్షకుడు, రాక్షసుడు లుక్స్ అంటూ 3 రోజులుగా ట్రెండింగ్ నడుస్తోంది. కొద్దిసేపటి కిందట ఈ సినిమా నుంచి రక్షకుడు లుక్ బయటకొచ్చింది. సుధీర్ బాబు లుక్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

సుధీర్ బాబు ఐఏఎస్ ఆఫీసర్ గా (రక్షకుడు) ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. సుధీర్ బాబు సరసన నివేత థామస్ హీరోయిన్ గా నటించనుంది. ఇక రాక్షసుడు లుక్ (నాని ఫస్ట్ లుక్) ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. నాని సరసన అదితి రావు హీరోయిన్.

దిల్ రాజు బ్యానర్ పై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది (సైరా ఫేమ్) సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ లో థియేటర్లలోకొస్తున్న మొదటి బడా సినిమా ఇదే. ఉగాది కానుకగా మార్చి 25న థియేటర్లలోకి వస్తోంది V.