సుధీర్ బాబు ఇంటర్వ్యూ

Tuesday,June 12,2018 - 06:41 by Z_CLU

సుధీర్ బాబు ‘సమ్మోహనం’ ఈ నెల 15 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. మోస్ట్ ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు ఈ హీరో. అవి మీకోసం…

నా SMS కి ముందే…

నా ఫస్ట్ మూవీ SMS కూడా రిలీజ్ అవ్వకముందే ఈ స్టోరీ విన్నా.. కానీ అప్పట్లో వర్కవుట్ కాలేదు. ఇప్పటికి కుదిరింది.

అదే మెయిన్ రీజన్…

రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది సినిమా. స్టోరీ విన్నప్పుడే చేసేయాలనిపించింది. ఇంకో ఆలోచన లేదు. స్టోరీ సినిమా చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ సినిమాటిక్ గా ఉండదు.

 

అదే నా క్యారెక్టర్…

సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని కుర్రాడిలా కనిపిస్తాను ఈ సినిమాలో. అలాగని సినిమా వాళ్ళంటే చులకన అని కాదు.. వాళ్ళ గురించి డిఫెరెంట్ పర్సెప్షన్ ఉన్న క్యారెక్టర్…

ఒక్కసారైనా…

ఏ యాక్టర్ అయినా ఒకసారి ఇంద్ర్రగంటి గారితో పని చేయాల్సిందే. ఆయన సినిమా సెట్ లో యాక్టరే కింగ్. యాక్టర్ కరెక్ట్ గా పర్ఫామ్ చేయాలంటే ఏం కావాలో, అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారాయన… నేనైతే ఆయన డైరెక్షన్ లో 100 సినిమాలైనా చేస్తా…

ఆలోచన అప్పటిదీ…

ఇంద్రగంటి గారికి ‘గోల్కొండ హై స్కూల్’ సినిమా చేస్తున్నప్పుడు వచ్చిన ఆలోచన ఇది. ఒక రియల్ ఇన్సిడెంట్ నుండి బిగిన్ అయిన ఆ థాట్ ని, చిన్నగా లవ్ స్టోరీలా కన్వర్ట్ చేసి తెరకెక్కించారాయన…

 

అప్పడే కుదురుతుంది…

కథ నుండి బిగిన్ అయితే ప్రతీది కుదిరినప్పుడే యాక్టర్ పర్ఫామెన్స్ ఎలివేట్ అవుతుంది. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా ఆర్టిస్ట్ పర్ఫామెన్స్ ఫ్లాట్ అయిపోతుంది.

రియల్ గా పర్ఫామ్ చేయడం…

నటించడం పెద్ద విషయం కాదు కానీ, రియల్ గా పర్ఫామ్ చేయడం చాలా కష్టం. అందునా ఈ సినిమాలో చాలా స్మూత్ గా ఉంటుంది నా బిహేవియర్. ప్రతీది ఇంద్రగంటి గారు చెప్పినట్టు చేయాల్సి వచ్చింది…

అదీ పరిస్థితి…

సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఎంత న్యాచురల్ గా ఉంటుందంటే సీన్ అయిపోయాక కూడా మా నాన్న, మా చెల్లి అనే ఫీలింగ్ తోనే ఉండిపోయేవాణ్ణి. రోజు నాకు నేను గుర్తు చేసుకోవాల్సి వచ్చేది.. ఇది జస్ట్ సినిమా , నా రియల్ లైఫ్ వేరు అని.. అంతగా కనెక్ట్ అయిపోయాను సినిమాకి…

 

అప్పుడే డిసైడ్ అయ్యా…

కరియర్ బిగినింగ్ లో చాలామందిని చూశా.. ట్యాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక, వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు, వేరే ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయిన వాళ్ళను చాలా మందిని చూశాను. అప్పుడే అనుకున్నా కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలి.. నాకా స్థాయి వస్తే నేనొక ప్రొడక్షన్ హౌజ్ పెట్టాలి అని…

చాలా పెద్ద చాలెంజ్…

పుల్లల గోపీచంద్ బయోపిక్ లో నటించడం నిజంగా చాలా పెద్ద చాలెంజ్. ప్రవీణ్ సత్తారు గారి డైరెక్షన్ లో.. బయోపిక్ అనగానే చాలా మంది యాక్టర్స్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని కూడా ట్రై చేస్తుంటారు… నేనైతే వాళ్ళ లైఫ్ ని క్యారీ చేస్తా…

2 భాషల్లో..

తెలుగు, హిందీ లాంగ్వేజెస్ లో తెరకెక్కుతుంది ఈ బయోపిక్. నేను కూడా పుల్లల గోపీచంద్  లైఫ్ ని కంప్లీట్ గా స్టడీ చేసి, ఆయన ప్రిన్సిపల్స్ తెలుసుకుని ఆతరవాతే సినిమా చేస్తాం…

అదీప్లాన్…

ఈ బయోపిక్ కోసం నిజంగానే ఒక టోర్నమెంట్ ఆడి, ఆ రియల్ ఎక్స్ ప్రెషన్స్ ని షూట్ చేయాలి ప్లాన్ చేస్తున్నాం. ప్రతీది చాలా రియలిస్టిక్ గా ఉండేలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. అందుకే లేటవుతుంది.

 

అదీ అదితి రావ్ హైదరి…

నేను అదితి నటించిన ‘చెలియా’ సినిమా చూశాను. మంచి నటి. అందుకే తనతో ఉన్న ప్రతి సీన్స్ కి ప్రిపేర్ అయి వెళ్ళేవాడిని. తను కూడా అంతే డెడికేటెడ్ గా ప్రిపేర్ అయి వచ్చి పర్ఫామ్ చేసేది. ఈ సినిమాకి డబ్బింగ్ కూడా తనే చెప్పుకుంది… ఇలాంటి క్యారెక్టర్ కి తనే బెస్ట్…

ఈ సినిమాతో పాటే…

నా నెక్స్ట్ సినిమా ఆల్మోస్ట్ 80% షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాతో పాటు ఆ సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నాం.

మహేష్ బాబుతో సినిమా…

ఫ్యూచర్ లో మంచి కథ దొరకాలే కానీ నా ప్రొడక్షన్ లో మహేష్ బాబు సినిమా కూడా ఉంటుంది.