సినిమా కోసం కలుస్తున్న స్టార్స్

Thursday,May 09,2019 - 02:03 by Z_CLU

సాధారణంగా ఓ సినిమాలో ఓ స్టార్ హీరోతో పాటు ఇంకో హీరో ఉంటే అది మల్టీస్టారర్ సినిమా. అలాంటి సినిమాల్లోనే ఇద్దరేసి హీరోల్ని ఒకేసారి చూసే అవకాశం ఉంటుంది. కానీ తెలుగు సినిమా స్టాండర్డ్స్ మారుతున్నాయి. వేరే హీరో సినిమానే అయినా, అవసరమనుకుంటే ఓ క్యారెక్టర్ లో కనిపించి సినిమాకి మరింత వ్యాల్యూ తెచ్చి పెడుతున్నారు స్టార్ హీరోలు.

 

 

అల్లరి నరేష్  – ‘మహర్షి’ అక్షరాలా మహేష్ బాబు సినిమానే. అందులో కీ రోల్ ప్లే చేశాడు అల్లరి నరేష్. జస్ట్ ఏదో అలా కనిపించాడు అని కాకుండా ఆల్మోస్ట్ కథకి మొదలు అక్కడి నుండే అనే స్థాయిలో ఉన్న పాత్రలో, సినిమాకి మరింత వ్యాల్యూ తెచ్చి పెట్టాడు. ఈ క్యారెక్టర్ ని ఇంకెవరు చేయలేరు అనలేం కానీ, అల్లరి నరేష్ చేశాడు కాబట్టే ఆ క్యారెక్టర్ అంతలా ఎలివేట్ అయింది. ఇది మాత్రం వాస్తవం.

కార్తికేయ :  ‘RX100’ తరవాత వరస ఆఫర్లు. నిజానికి గ్యాప్ లేకుండా బిజీ బిజీగా ఉన్నాడు కార్తికేయ. అలాంటి సమయంలో కూడా నాని సినిమాలో క్యారెక్టర్ అనగానే ‘నో’ అనకుండా సంతకం చేసేశాడు. ఈ సినిమాలో విలన్ గా  కనిపించబోతున్నాడు కార్తికేయ.     

నాని -సుధీర్ బాబు : రీసెంట్ గా లాంచ్ అయిన ‘V’ సినిమా సుధీర్ బాబుదే. అయితే ఈ సినిమాలో నాని కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయిన రోజు నాని ఈ సినిమాలో ప్లే చేస్తున్న రోల్ పై చాలా డిస్కషన్స్ నడిచాయి. కట్ చేస్తే ఈ సినిమాలో నాని కనిపించేది మహా అయితే 15 నిమిషాలు మాత్రమే.

జనరల్ గా డిస్కస్ చేసుకుంటే పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ ఒక హీరో సినిమాని లీనమై చూస్తున్నప్పుడు, మరో స్టార్ హీరో అదే స్క్రీన్ పై క్రియేట్ చేసే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. అందుకే సినిమా సక్సెస్ అవుతుందంటే వేరే స్టార్ సినిమా అయినా సరే,  నటించడానికి రెడీ అంటున్నారు స్టార్ హీరోలు.