సుధీర్ బాబు సమ్మోహనం - ఫస్ట్ ఇంప్రెషన్ రివ్యూ

Tuesday,May 01,2018 - 06:06 by Z_CLU

మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది సుధీర్ బాబు సమ్మోహనం. మెగాస్టార్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ రిలీజవ్వడంతో న్యాచురల్ గానే ఈ టీజర్ కి మరింత ఆడ్ అయింది. ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ టీజర్ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఎలా ప్రెజెంట్ చేశాడో ఓ సారి చూసేద్దాం…

 “సినిమా సాహిత్యం బ్రతికే ఉంటాయి అంతే…’ అంటూ బిగిన్ అయ్యే ఈ ఫస్ట్ ఇంప్రెషన్ టోటల్ గా ఇంప్రెస్ చేస్తుంది. రీల్ కి రియాలిటీ కి మధ్య డిఫెరెన్స్… ఇదేనా సుధీర్ బాబు కొత్త సినిమా ‘సమ్మోహనం’ లో హైలెట్ కాబోయే పాయింట్…? జస్ట్ 1:09 నిమిషాల టీజర్ తో అది కన్ఫం చేయడం కష్టమే కానీ, ఇది డెఫ్ఫినేట్ గా ఒక టాప్ స్టార్ కి, అసలు సినిమాలంటేనే పాజిటివ్ ఒపీనియన్ లేని ఒక యంగ్ స్టర్ కి మధ్య జరిగే ఇమోషనల్ రొమాంటిక్ జర్నీ అని మాత్రం తెలుస్తుంది.

రెగ్యులర్ స్టోరీస్ కి డిఫెరెంట్ గా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి చూజ్ స్టోరీలైన్ ఈ టీజర్ లో ఎగ్జాక్ట్ గా రివీల్ అవ్వడం లేదు కానీ, కనిపించిన ఆ కాసేపట్లో సుధీర్ బాబు, అదితి రావు హైదరి కెమిస్ట్రీ అదుర్స్ అనిపిస్తుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్.