సమ్మోహనం ఫస్ట్ వీక్ కలెక్షన్

Friday,June 22,2018 - 06:24 by Z_CLU

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, అదితి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సమ్మోహనం. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తిచేసుకుంది. రిలీజైన ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాకు ఈ 7 రోజుల్లో వరల్డ్ వైడ్ 4 కోట్ల 55 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 కోట్ల 41 లక్షల రూపాయల షేర్ వచ్చింది. చూడ్డానికి ఇది కాస్త తక్కువ అనిపిస్తున్నప్పటికీ మూవీ బడ్జెట్, రిలీజైన థియేటర్ల కౌంట్ తో పోల్చి చూస్తే సినిమా సక్సెస్ కింద లెక్క. పైగా ప్రస్తుతం హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే కావడంతో.. సమ్మోహనంకు మరో వారం రోజులు స్కోప్ దొరికింది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ షేర్

నైజాం – రూ. 1.30 కోట్లు

సీడెడ్ – రూ. 0.45 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 0.45 కోట్లు

ఈస్ట్ – రూ. 0.32 కోట్లు

వెస్ట్ – రూ. 0.16 కోట్లు

గుంటూరు – రూ. 0.26 కోట్లు

కృష్ణా – రూ. 0.34 కోట్లు

నెల్లూరు – రూ. 0.13 కోట్లు