ఈ వీకెండ్ సినిమాలు

Wednesday,June 13,2018 - 03:02 by Z_CLU

ఈ వీకెండ్ 2 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. గమ్మత్తుగా రెండూ ఒకే జానర్ కు చెందిన సినిమాలు. అవే నా నువ్వే, సమ్మోహనం మూవీస్. ప్లాట్స్ వేరయినా రెండూ ప్రేమకథలే. వీటిలో ఏది బాక్సాఫీస్ విన్నర్ అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

రేపు నా నువ్వే సినిమా థియేటర్లలోకి వస్తోంది. కల్యాణ్ రామ్ కెరీర్ లో ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ స్టోరీ ఇది. ఈ సినిమా కోసం యాక్షన్ హీరో కాస్తా లవర్ బాయ్ గా మేకోవర్ కూడా అయ్యాడు. జయేంద్ర డైరక్ట్ చేసిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన తమన్న హీరోయిన్ గా నటించింది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మరో హైలెట్. కల్యాణ్ రామ్ కు ఈ సినిమా సరికొత్త ఇమేజ్ తీసుకొస్తుందేమో చూడాలి.

నా నువ్వే విడుదలైన 24 గంటల గ్యాప్ లో సమ్మోహనం రిలీజ్ అవుతోంది. శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా కూడా లవ్ స్టోరీనే. సుధీర్ బాబు, అదితి రావు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు.

నా నువ్వేపై కల్యాణ్ రామ్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో, సమ్మోహనంపై సుధీర్ బాబు కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. ఇంద్రగంటి డైరక్షన్ లో వంద సినిమాలైనా చేస్తానంటున్నాడు. సో.. వీళ్లిద్దరూ నటించిన రెండు ప్రేమకథలు హిట్ అవ్వాలని కోరుకుందాం.