సుధీర్ బాబు ఇంటర్వ్యూ

Thursday,September 20,2018 - 04:04 by Z_CLU

ఈ నెల 21 న రిలీజవుతుంది సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ సినిమా. సుధీర్ బాబు ప్రొడక్షన్ లో తెరకెక్కిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ఉంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుధీర్ బాబు, ఈ సినిమాతో పాటు తన బ్యానర్ లో ఫ్యూచర్ సినిమాల గురించి కూడా మాట్లాడాడు. అవి మీకోసం..

 

అదే రీజన్…

కొత్తవాళ్ళకి ముఖ్యంగా ట్యాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ అని, ఇంకేవో జాబ్స్ అని వెళ్ళిపోతున్న  వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రొడక్షన్ హౌజ్ పెట్టాను…

 

అలా మొదలైంది…

బ్యానర్ పెట్టాలనుకోవడంలో ఇంకో ఉద్దేశం ఏంటంటే యాక్టర్ అనే వాడు ఎప్పటికైనా ఫేడవుట్ అయిపోవచ్చు కానీ, బ్యానర్ ఉంటే ఎప్పటికైనా సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు. అది జస్ట్ మనతో ఆగిపోదు. నా పిల్లలు, ఆ తరవాత వాళ్ళ పిల్లలు ఇలా నెక్స్ట్ జెనెరేషన్ కి కూడా ఉంటుంది.

 

సమ్మోహనం కన్నా ముందే…

ఈ సినిమా ‘సమ్మోహనం’ రిలీజ్ కన్నా ముందే స్టార్ట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యాకే సినిమా సెట్స్ పైకి వచ్చింది. నేను ఏ సినిమా చేసినా మినిమం 6 నుండి 7 నెలల టైమ్ పడుతుంది.

నిజానికి నేను కాదు

నిజానికి బిగినింగ్ లో ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదు. జస్ట్ హీరోగా సంతకం చేశాను . ఆ తరవాత అనుకోకుండా ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యేసరికి, నేను టేకోవర్ చేశాను.

 

నేనంతే…

ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అని ఫిక్సవ్వలేదు. ఒకసారి స్క్రిప్ట్ ప్రొడక్షన్ స్టేజ్ కి వచ్చాక బడ్జెట్ గురించి, మార్కెట్ గురించి అస్సలు ఆలోచించలేదు. నా బ్యానర్ లో ఒక మంచి సినిమా రావాలి. ఈ సినిమాకి పని చేసిన  వాళ్ళందరికీ మంచి పేరు రావాలి అదే ఆలోచనతో పని చేశాను, డెసిషన్స్ తీసుకున్నాను.

 

చాలా దగ్గరగా

సినిమాలోని ప్రతి క్యారెక్టర్ రియల్ లైవ్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రిలేట్ అవ్వగలుగుతారు.

నో ఇమోషన్

సినిమాలో నా క్యారెక్టర్ కి షార్ట్ టెంపర్ ఉండదు కానీ కొంచెం ఇమోషన్స్ తక్కువ. ఏదైనా బిజినెస్, టార్గెట్స్ అంటూ ఉంటాడు. అలాంటిది చిన్నగా… సిచ్యువేషన్స్ ని బట్టి మారతాడు.

 

మహేష్ బాబుతో సినిమా…

మహేష్ బాబుతో నా బ్యానర్ లో సినిమా కంపల్సరీగా ఉంటుంది కానీ ఆ స్థాయికి రీచ్ అవ్వాలంటే ఇంకా టైమ్ పడుతుంది. అంత పెద్ద రెస్పాన్స్ బిలిటీ హ్యాండిల్ చేయడానికి ఇంకా టైమ్ కావాలి.

 

నేను చాలా ఇండిపెండెంట్…

నేను బిగినింగ్ నుండి చాలా ఇండిపెండెంట్. నా స్ట్రగుల్ టైమ్ లో కూడా ఎప్పుడూ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కానీ, మహేష్ బాబు గారి దగ్గరీ వెళ్లి కానీ ఎవరికైనా రిఫర్ చేయమని కూడా అడగలేదు. ఎలాంటి సహాయం వాళ్ళ దగ్గరి నుండి తీసుకోలేదు. నాకు నేనుగా ఎదగాలి అనుకున్నా.

 

అందుకే అజనీష్

అజనీష్ కన్నడలో వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. కొన్ని అవార్డు ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు కలుస్తుంటాను ఆయన్ని. ఎప్పుడు వచ్చినా కంపల్సరీగా ఒక అవార్డు తీసుకుని వెళ్తుంటాడు. అందుకే ఒకసారి అయన బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసి, ఆయన చేసిన సాంగ్స్ విని, ఈ సినిమాకి ఆయనే కరెక్టని ఫిక్సయ్యాం.

 

నభా నటేష్…

నభా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో నేను సరిగ్గా పర్ఫాం చేయకపోయినా, పెద్దగా డిఫెరెన్స్ ఏమీ ఉండదు. కానీ నభా నతేష్ తన క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వకపోతే, 100% ఇవ్వకపోతే ఆ వెలితి ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ తనది. దానికి తగ్గట్టుగానే ఎనర్జిటిటిక్ గా పర్ఫామ్ చేసింది. తనకి టాలీవుడ్ లో మంచి ఫ్యూచర్ ఉంటుంది.

 

మహేష్ బాబు చాలా హ్యాప్పీ…

నేను సినిమాలు చేస్తాను అన్నప్పుడే మహేష్ బాబు గారు కొంచెం కంగారు పడ్డారు. ఏ ఫీల్డ్ లో అయినా, సక్సెస్, ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ సినిమా విషయానికి వస్తే సక్సెస్ అయినా, అందరికీ తెలుస్తుంది. ఫెయిల్ అయినా అందరికీ తెలిసిపోతుంది. అది నేను తట్టుకోగలుగుతానో లేదో అని బిగినింగ్ లో కంగారు పడ్డా.. ఇప్పుడు ఆయన కూడా చాలా హ్యాప్పీ.