బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేసిన సుధీర్ బాబు

Friday,November 03,2017 - 07:02 by Z_CLU

సుధీర్ బాబు సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే డిఫెరెంట్ సినిమా గ్యారంటీ అని కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అలాంటి సుధీర్ బాబు చేతినిండా సినిమాలతో మరో రెండేళ్ళు ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిజీ కానున్నాడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వరసగా 5 సినిమాలను అనౌన్స్ చేశాడు.

డెబ్యూ డైరెక్టర్ ఇంద్రసేన డైరెక్షన్ లో సోషియో థ్రిల్లర్ లో నటించనున్న సుధీర్ బాబు, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా మరో డెబ్యూ డైరెక్టర్ రాజశేఖర్ డైరెక్షన్ లో ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కనున్న ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గర కానున్నాడు.

ఈ రెండు సినిమాలతో పాటు ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో లవ్ స్టోరీ లో నటించనున్న సుధీర్ బాబు, హర్షవర్ధన్ డైరెక్షన్ లో USA బ్యాక్ డ్రాప్ లో మరో లవ్ థ్రిల్లర్ లో నటించనున్నాడు సుధీర్. ఈ సినిమా తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు మరో సినిమాను కూడా అనౌన్స్ చేసిన సుధీర్ బాబు ఆ సినిమా డీటేల్స్ ని గెస్ చేసే పని ఫ్యాన్స్ కే అప్పగించాడు. ఈ సినిమా కూడా బైలింగ్వల్ కానుండటం విశేషం.