సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ ట్రైలర్ రివ్యూ

Monday,September 10,2018 - 05:55 by Z_CLU

సుధీర్ భాబు ‘నన్ను దోచుకుందువటే’ ట్రైలర్ రిలీజయింది. సెప్టెంబర్ 21 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా R.S. నాయుడు డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. అయితే గతంలో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసి సినిమాలో లీడ్ రోల్స్ ఎలా ఉండబోతున్నాయో క్లారిటీ ఇచ్చిన ఫిలిమ్ మేకర్స్,  ఈ ట్రైలర్ లో ఈ క్యారక్టర్స్ ని ఇంకొంచెం రివీల్ చేశారు.

టార్గెట్ ఓరియంటెడ్ మ్యానేజర్ లా కనిపించనున్నాడు సుధీర్ బాబు ఈ సినిమాలో. ఇక హీరోయిన్ విషయానికి వస్తే సాఫ్ట్ వేర్ ఇంజినీర్, షార్ట్ ఫిలిమ్స్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేయడం హాబీ… ఈ ఇద్దరి మధ్య నడిచే లవ్ స్టోరీతో తెరకెక్కిందే ‘నన్ను దోచుకుందువటే’ సినిమా.

2: 16 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ లో టిపికల్ మ్యానేజర్ లా కనిపించే సుధీర్ బాబు, యాక్టింగ్ చేయడం రాకపోయినా, షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడు…? అసలీ లవ్ స్టోరీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే   కాన్ఫ్లిక్ట్ ఏంటి..? అనే క్యూరియాసిటీ ని రేజ్ చేస్తుంది ఈ ట్రైలర్.

సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫస్ట్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నతేష్ హీరోయిన్ గా నటిస్తుంది.  అజనీష్ బి. లోకనాథ్ మ్యూజిక్ కంపోజర్. ఈ ట్రైలర్ తో సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచేసిన సుధీర్ బాబు & టీమ్, త్వరలో ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.