కంప్లీట్ కాన్సంట్రేషన్ సుధీర్ బాబు పైనే...

Monday,August 06,2018 - 01:17 by Z_CLU

మోస్ట్ ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్ లా తెరకెక్కుతుంది ‘వీర భోగ వసంత రాయలు’. అయితే ఈ సినిమా నుండి సుధీర్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్  రిలీజయింది. వరసగా శ్రియ, శ్రీ విష్ణు, నారా రోహిత్ తరవాత ఇప్పుడు సుధీర్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన ఫిలిమ్ మేకర్స్ ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే, ఈ  సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్ ఏమై ఉంటుందా అనే ఆలోచన ఇప్పుడు ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ రేజ్ చేస్తుంది. రీసెంట్ గా ‘సమ్మోహనం’ సినిమాలో సాఫ్ట్ క్యారెక్టర్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన సుధీర్ బాబు, అదే స్పీడ్ లో ఇమ్మీడియట్ గా సొంత ప్రొడక్షన్ లో ‘నన్ను దోచుకుందువటే’ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చాడు.

 

అటు లవర్ బాయ్ గా సక్సెస్ ట్రాక్ ని క్రియేట్ చేసుకుంటూనే మరో వైపు డిఫెరెంట్ క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేస్తున్న సుధీర్ బాబు ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడనేది క్యూరియాసిటీ రేజ్ చేస్తున్న క్వశ్చన్. R. ఇంద్రసేన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి త్వరలో టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఫిలిమ్ మేకర్స్ ఈ టీజర్ ని ఎలా ప్రెజెంట్ చేస్తారో ప్రస్తుతానికి గెస్ చేయడం కష్టమే కానీ, డెఫ్ఫినేట్ గా సుధీర్ బాబు క్యారెక్టర్ పై క్లారిటీ వచ్చే చాన్సెస్ ఉన్నాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మార్క్ K. రాబిన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని అప్పారావు బెల్లన బాబా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్  కాలేదు.