రామ్ గోపాల్ వర్మ

Wednesday,November 30,2016 - 05:20 by Z_CLU

రామ్ గోపాల్ వర్మ ప్రముఖ దర్శకుడు. ఏప్రిల్ 7, 1962 లో జన్మించారు. నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన ‘శివ’ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తో దర్శకుడిగా విజయం అందుకోవడంతో పాటు నంది అవార్డు తో పాటు, ఫిలిం ఫేర్ అవార్డు, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం తమిళ్, హిందీ లో రీమేక్ చేశారు వర్మ.ఈ చిత్రం తరువాత తెలుగు లో ‘క్షణం క్షణం’,’అంతం’ హిందీలో ‘ద్రోహి’ ,గాయం(తెలుగు),’రంగీలా'(హిందీ), సత్య(హిందీ),కంపెనీ(హిందీ), ‘భూత్'(హిందీ), సర్కార్(హిందీ),’మనీ'(తెలుగు),’దెయ్యం’, ‘రాత్రి’, ‘గోవిందా గోవిందా’,’కూల్'(హిందీ) ‘రక్త చరిత్ర'(తెలుగు),’కిల్లింగ్ వీరప్పన్ (తెలుగు) వంటి పలు సినిమాలతో దర్శకుడిగా విజయాలు అందుకున్నారు. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ‘స్కూల్’ సినిమాకు గాను బెస్ట్ ఫీచర్ ఫిలిం హిందీ కేటగిరి లో నేషనల్ అవార్డు తో పాటు దర్శకుడిగా పలు సినిమాలకు ఆరు నంది అవార్డులు, మూడు ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్నారు.

Born : 7 April 1962

సంబంధిత వార్తలు

సంబంధించిన చిత్రం