క్యూరాసిటీ రేజ్ చేస్తున్న నాగార్జున మూవీ హీరోయిన్

Thursday,November 30,2017 - 01:22 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది నాగ్ RGV మూవీ. ఈ సినిమాలో నాగార్జున పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన నాగ్ లుక్స్ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తే, నిన్న మొన్నటి వరకు ఈ మూవీలో నాగ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరా అనే డిస్కర్షన్స్ కూడా జోరుగా నడిచాయి. అయితే ఆ డిస్కషన్స్ కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ మూవీలో మైరా షరీన్ హీరోయిన్ గా నటిస్తుంది.

కంప్లీట్ RGV మార్క్ తో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ లుక్ ని RGV స్టైల్ లోనే రివీల్ చేసింది సినిమా యూనిట్. నాగ్ ఫస్ట్ లుక్ ని  చెయిన్ తో పాటు రివాల్వర్ స్టిల్స్   తో రివీల్ చేసిన టీమ్, మైరా షరీన్  ను  కూడా అదే రేంజ్  మాస్ స్టైల్ లో ప్రెజెంట్ చేసింది.

 

రీసెంట్ గా రాజుగారి గది 2 లో  డిఫెరెంట్ క్యారెక్టరైజేషన్ తో ఇంప్రెస్ చేసిన నాగ్, ‘శివ’ లాగే ఈ మూవీ కూడా తన కరియర్ లో బెస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేసుకుంటుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాగార్జున. ఈ మూవీని రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్నాడు.