RGV 'లక్ష్మీస్ NTR' ఫస్ట్ లుక్ టీజర్

Saturday,January 19,2019 - 11:03 by Z_CLU

నిన్న NTR వర్థంతి సందర్భంగా ‘లక్ష్మీస్ NTR’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయింది. RGV మార్క్ తో, NTR లైఫ్ ని మరింత రియలిస్టిక్ యాంగిల్ లో ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్న RGV, ఈ టీజర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేశాడు. జస్ట్ ఒక్క నిమిషం నిడివి తో రిలీజైన ఈ టీజర్, యూ ట్యూబ్ లో మోస్ట్ ట్రెండింగ్ ఎలిమెంట్ లా మారింది.

ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కథానాయకుడు’ NTR లైఫ్ లోని ఇమోషనల్ మూమెంట్స్ ని అభిమానులకు మరింత దగ్గర చేసింది. మరోవైపు ‘మహానాయకుడు’ రిలీజ్ కి రెడీ అవుతుంది. వీటితో పాటు RGV డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా NTR ఫ్యాన్స్ లో అదే స్థాయి ఆసక్తి కనిపిస్తుంది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ కి అంతగా కనెక్ట్ కాకపోయినా, సినిమాలో సందర్భానుసారంగా సింక్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఆడియెన్స్. కళ్యాణ్ మాలిక్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రాకేశ్ రెడ్డి ఈ సినిమాకి ప్రొడ్యూసర్.