వెరైటీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

Wednesday,March 28,2018 - 12:01 by Z_CLU

నాగ్-వర్మ కాంబోలో ఆఫీసర్ సినిమా తెరకెక్కుతోంది. సెట్స్ పైకి రాకముందు ఈ మూవీపై చాలా రూమర్లు నడిచాయి. శివ సినిమా ఛాయల్లోనే ఆఫీసర్ కూడా ఉండబోతోందంటూ స్టోరీలొచ్చాయి. కానీ మూవీ లాంఛింగ్ రోజునే శివకు, ఆఫీసర్ కు సంబంధం లేదని ప్రకటించారు. అక్కడితో ఆగిపోయిన ఆ రూమర్ ఇప్పుడు మళ్లీ హైలైట్ అయింది.

ఈసారి వర్మ-అఖిల్ కలిసి సినిమా చేయబోతున్నారు. మరి ఈసారి శివ సీక్వెల్ ఉండబోతోందా..? ఎందుకంటే శివ టైపు కంటెంట్ రాసుకుంటే అఖిల్ ఏజ్ గ్రూప్ కు అది పెర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మరీ ముఖ్యంగా అఖిల్ ఇప్పుడున్న పొజిషన్ కు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ మూవీ పడితే, నాగార్జునకు శివలా అఖిల్ కు ఇది మంచి బేస్ మెంట్ అవుతుంది. అందుకే వర్మ-అఖిల్ మూవీకి సంబంధించి ‘శివ’ డిస్కషన్ పాయింట్ అయింది.

అయితే వర్మ మాత్రం ఈసారి శివ టాపిక్ తీసుకురావడం లేదు. అఖిల్ తో పక్కా యాక్షన్ సినిమా చేస్తానంటున్న ఆర్జీవీ.. అంతర్లీనంగా లవ్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు. శివ సినిమా కూడా దాదాపు ఇంతే కదా.

కెరీర్ స్టార్ట్ చేసిన నాలుగేళ్లకు నాగార్జునకు శివ సినిమా పడింది. సేమ్ టు సేమ్ అఖిల్ కూడా కెరీర్ స్టార్ట్ చేసిన నాలుగేళ్లకు వర్మతో సినిమా చేస్తున్నాడు. ఈ సెంటిమెంట్ కూడా కలిసొస్తే అఖిల్ కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు చేరుకుంటుంది. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నాడు ఈ సినిమాని.