నాగ్-వర్మ మూవీ అప్ డేట్స్

Monday,November 20,2017 - 02:39 by Z_CLU

నాగార్జున, ఆర్జీవీ కాంబోలో ఈరోజు కొత్త సినిమా ప్రారంభమైంది. నాగార్జున పోలీసాఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే మొదలైంది. ఈరోజు నుంచి 10 రోజుల పాటు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ఉంటుంది. అఖిల్ హీరోగా హలో అనే సినిమా నిర్మిస్తున్నాడు నాగార్జున. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో వర్మ సినిమా షూటింగ్ కొనసాగుతుందని నాగ్ ప్రకటించాడు.

గతంలో వచ్చిన శివ సినిమాకు తాజా చిత్రానికి ఎలాంటి సంబంధం ఉండదంటున్నాడు నాగ్. కాకపోతో టెక్నికల్ గా శివ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో.. ఈ సినిమా కూడా టెక్నికల్ గా అత్యుత్తమంగా ఉంటుందంటున్నాడు నాగార్జున.

“రాము యాక్షన్ సినిమాలు తీస్తాడు, మాఫియా సినిమాలు తీస్తాడు, కానీ ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ కాన్సెప్ట్ చాలా యూనిక్. నా పాత్రలో ఉన్న సంఘర్షణ చాలా కొత్తగా ఉంటుంది. ఓ మనిషి నమ్మితే దానికోసం ఎంతకైనా తెగిస్తాడనే పాత్రలో నేను కనిపిస్తాను. రాము చెప్పిన స్టోరీ నన్ను చాలా ఇన్ స్పైర్ చేసింది.” తన కొత్త సినిమాలో క్యారెక్టర్ పై నాగార్జున వివరణ ఇది.

సినిమాను వీలైనంత తొందరగా పూర్తి, అంతే తొందరగా రిలీజ్ చేస్తామంటున్నాడు నాగ్. ఈ సినిమాకు వర్మ దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.