వర్మ దర్శకత్వంలో బాలయ్య.. నిజమెంత?

Wednesday,July 05,2017 - 06:02 by Z_CLU

వర్మ-బాలయ్య కాంబినేషన్ లో సినిమా రానుందని, వీరిద్దరూ ఎన్టీఆర్ బయోపిక్ చేయబోతున్నారని అన్ని మీడియాల్లో వచ్చేసింది. ఆ వెంటనే వర్మ కూడా ఎన్టీఆర్ పై చేయబోయే బయోపిక్ పై ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు. సో ఎన్టీఆర్ బయోపిక్ అనేది పక్కా అయింది.. కానీ సస్పెన్స్ ఏంటంటే.. వర్మ ఎక్కడా హీరో ప్రస్తావన తీసుకురాలేదు.

బాలయ్య కూడా మొన్నీ మధ్యే ఎన్టీఆర్ పై బయోపిక్ చేస్తానన్నాడు.. కానీ డైరక్టర్ ఎవరో మాత్రం చెప్పలేదు. వర్మ కూడా ప్రెస్ నోట్ ద్వారా బయోపిక్ అని చెప్పాడే కానీ హీరో ఎవరో చెప్పలేదు. మీడియా మాత్రం వీళ్లిద్దర్నీ కలిపేసింది. పూరి కాంపౌండ్ లో ఈ మధ్యే వర్మ- బాలయ్య సినిమా సెట్ అయ్యిందని ఆల్మోస్ట్ ఎన్టీఆర్ బయోపిక్ ఈ కాంబినేషన్ లోనే వుంటుందని రూమర్ వినిపిస్తోంది

ఇంతకీ ఎన్టీఆర్ బయోపిక్ లో హీరో ఎవరు.. ఇప్పటికే కథను రెడీ చేయించే ప్రాసెస్ లో ఉన్న బాలయ్య ఈ సినిమాను వర్మ దర్శకత్వంలోనే చేస్తాడా… ఒకవేళ వర్మ చెప్పినట్టు బయోపిక్ లో వివాదాస్పద అంశాలు కనుక ఉంటే అందులో బాలయ్య నటిస్తాడా.. అసలింతకీ వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయో పిక్ ఉంటుందా.. ?