నాగార్జున-ఆర్జీవీ మూవీ టైటిల్ ఫిక్స్

Tuesday,February 27,2018 - 05:33 by Z_CLU

నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. కేవలం టైటిల్ ఫిక్స్ చేసి ఊరుకోలేదు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడంతో పాటు మూవీ రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు. వర్మ-నాగ్ సినిమాకు ఆఫీసర్ అనే పేరుపెట్టారు. సినిమాను మే 25న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. అందుకే సినిమాకు ఆఫీసర్ అనే టైటిల్ పెట్టారు. నాగ్ లుక్ తో, ఆఫీసర్ అనే టైటిల్ తో ఫస్ట్ లుక్  రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. మార్చి 10 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. మూవీలో నాగ్ సరసన మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. తన సొంత బ్యానర్ పై స్వీయదర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమా ఇది.