యాక్షన్ మోడ్ లో నాగ్ కొత్త సినిమా

Wednesday,February 07,2018 - 10:04 by Z_CLU

నాగార్జున RGV కొత్త సినిమా ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అల్టిమేట్ రివేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబై లోని ఎస్సెల్ వరల్డ్ థీమ్ పార్క్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే వి ఆర్ బ్యాక్ అంటూ, సినిమాలోని ఇంట్రెస్టింగ్ స్టిల్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాగార్జున. దాంతో అక్కినేని ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ ఈ సినిమాపై మళ్ళింది.

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్ మార్చి 10 వరకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది RGV టీమ్.

నాగార్జున పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమైరా షరీన్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమా టైటిల్ తో పాటు, ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, ఈ సినిమా ‘శివ’ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్నాడు.