'శివ' కాంబినేషన్ రిపీట్

Wednesday,October 04,2017 - 03:23 by Z_CLU

1989లో విడుదలైన శివ సినిమా ఎంతటి సెన్సేషనల్ హిట్ సాధించిందో తెలిసిందే.. అప్పటి వరకూ మూస పద్దతిలో సాగుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా శివ.. ఈ సినిమాతో తమ కాంబినేషన్ ది బెస్ట్ అనిపించుకున్నారు నాగార్జున – రామ్ గోపాల్ వర్మ. దాదాపు 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది.

ప్రస్తుతం ‘రాజు గారి గది 2’ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసిన కింగ్ త్వరలోనే రామ్ గోపాల్ వర్మతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఆర్.జి.వి చెప్పిన యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ కి షాక్ అయిన నాగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

ఈ సినిమాకు సంబంధించి నిన్నటి వరకూ వచ్చిన వార్తపై లేటెస్ట్ గా ఇద్దరూ క్లారిటీ ఇచ్చేసి త్వరలోనే మా కాంబినేషన్ లో మంచి యాక్షన్ స్క్రిప్ట్ తో సినిమా తెరకెక్కనుందని అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాకు ‘శివ’ కు ఎలాంటి సంబంధం ఉండదని, ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని ఇందులో నాగ్ సరికొత్తగా కనిపిస్తాడని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. మరి ఇన్నేళ్ల తర్వాత నాగ్ తో సినిమా చేయబోతున్న ఆర్.జి.వి  మళ్ళీ శివ మేజిక్ రిపీట్ చేస్తాడా…చూడాలి.